7000 సంవత్సరాలనుండి కథ

 రామసేతు వయసు ఇప్పటివరకు 7000 ఏళ్లు దాని నిర్మాణం తర్వాత అయోధ్యాన్ని 11000 యేళ్ళు పాలించాలి కానీ ఇప్పుడు రాముడు అయోధ్యలో లేడు 7000+11000=18000 రాముడు భవిష్యత్తు కి వెళ్ళిపోయాడు?

7000 సంవత్సరాల కధ చెప్పినది ఎవరు బాబూ. విదేశీయులా, మన కుహనా మేధావులా?.

మన కుహనా మేధావులు అయితే ఆలోచించడం దండగ. వాళ్ళకు చెవులు, బుర్ర పనిచేయవు, ఒక్క నోరు తప్ప.

విదేశీయులలో కొందరు సనాతనధర్మాన్ని గౌరవించేవారు, పూజించేవారు ఉన్నారు. మనలో లేరని కాదు.మనవారికి విదేశీ మోజు ఎక్కువని ఇలా వ్రాయడం జరిగింది.

ఇక విషయానికి వద్దాం.

బ్రహ్మాండం బ్రద్దలయి విశ్వం ఏర్పడింది అని మన ఒక ఋషి ఒకరు చెబితే అందరు ఋషులూ నిజమేనన్నారు. భూమి పుట్టి ఇన్నేళ్ళయిందని ఋషులందరూ ఒకేమాట మీద ఉన్నారు. గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అని అందరూ ఒకేలా చెప్పారు. భూమి, చంద్రుడు తిరిగే వేగాన్ని అందరూ ఒకేలా చెప్పారు. భూమికి సూర్యుడికి మధ్య దూరం గురించి అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వృక్షాలకు కూడా స్పందన, వినికిడి, ప్రాణం ఉంటుందని మన ఋషులందరూ వేల సంవత్సరాల క్రితమే చెప్పారు, ఒకే మాటమీద ఉన్నారు.

ఇక విదేశీ శాస్త్రజ్ఞుల గురించి చూద్దాం:

నెయ్యి నూనె తినకండి. క్రొవ్వు పెరిగి గుండె జబ్బులు వస్తాయని వారు చెప్పడంతో ౩౦ సంవత్సరాలు నోరు కట్టుకుని చప్పిడి మెతుకులు తింటే అసలు వాటికీ గుండె జబ్బులకి సంబంధం లేదని ఇప్పుడు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.

1980లలో పరగడుపున 160 ఉంటే సుగర్ వ్యాధి అన్నారు. తరువాత 10 సంవత్సరాల కొకసారి 140,120, 110 అని ఇప్పుడు 80 దాటితే వ్యాధే అంటున్నారు. ఈ లోపులో అమెరికా వాడు " ఎవరు చెప్పారు, 250 లోపు ( HBA1C 8 ) జబ్బే కాదు, మందులు వాడక్కరలేదు " అంటున్నాడు. ఇదీ సంగతి.

Big bang theory ఒకడు ఒప్పుకుంటే ఇంకోడు ఠాఠ్ అంటున్నాడు.

వాళ్ళు కన్ఫ్యూజ్ అయి మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేసే ఇటువంటి విదేశీ శాస్త్రజ్ఞులు చెప్పే విషయాలను నమ్మడమెలాగండి సారూ.

అందుకని కొంచెం బాధగా ఉన్నా మన ఋషులు, ప్రాచీన వాజ్మయం తెలియచేసిన విషయాలనే నమ్మి ఎదరకు గర్వంగా సాగుదాం.

శుభమస్తు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం

శ్రీరామునికి సోదరి ఉందా????

రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు?