యజ్ఞోపవీతం, జంధ్యము సమానార్ధకాలా? కొద్దిపాటి తేడా ఏమన్నా ఉందా? లఘుశంక తీర్చుకునేటప్పుడు చెవికి తగిలించడం చూశాను. ఈ క్రియ వల్ల ఏమన్నా పరమార్దం ఉన్నదా? (తెలుసుకోవడానికి మాత్రమే)*** సంప్రదాయాన్ని గౌరవించాలి.. పాటించాలి అనే దృక్పధంఉన్న వారి కోసం ***రెండూ ఒక్కటే…యజ్ఞోపవీతం అన్నది సంస్కృత పదం. జంధ్యం అన్నది తెలుగు వాడుకలోని మాట." యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్…. బలమస్తు తేజః " అని శ్లోకం. యజ్ఞోపవీతం పరమ పవిత్రం అయినది అని అర్థం. లఘు శంక సమయంలోనే కాదు దీర్ఘ శంక అప్పుడు కూడా యజ్ఞోపవీతాన్ని మెడలో హారం లాగా మార్చుకుని, కుడి చెవికి చుట్టుకోమని సంప్రదాయం ఆనతి. నమ్మకం ఉండి, ఆచరించ గలిగిన వారు అలానే చేస్తారు.ఎందుకు అంటే, కుడి చెవిలో గంగ ఉంటుంది అని నమ్మిక. కొందరు అది అగ్ని స్థానం అనీ అనడం విన్నాను. మల మూత్ర విసర్జనా సమయంలో అపవిత్రం అవుతుందేమో అనే కారణంతో కుడి చెవుకి చుట్టుకోవాలని చెప్పి ఉండవచ్చు. కుడి చెవికే ఎందుకు అన్నదానికి కారణం పైన రాసాను.ఇంకో విషయం : దైవ పూజలప్పుడు యజ్ఞోపవీతం ఉపవీతి గా.. అంటే ఎడమ భుజం పైన ఉంటుంది. ఈ స్థితి నే ' సవ్యం ' అనీ అంటారు. పితృ కార్యాలప్పుడు కుడి భుజం మీదికి మార్చుకోవాలి. దీన్ని ' ప్రాచీనావీతి ' అంటారు. ' అపసవ్యం ' అనీ అంటారు. మనుష్య కార్యాలప్పుడు ' నివీతి ' గా అంటే మెడలో హారం లాగా ధరిస్తారు.

*** సంప్రదాయాన్ని గౌరవించాలి.. పాటించాలి అనే దృక్పధంఉన్న వారి కోసం ***

రెండూ ఒక్కటే…

యజ్ఞోపవీతం అన్నది సంస్కృత పదం. జంధ్యం అన్నది తెలుగు వాడుకలోని మాట.

" యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్…. బలమస్తు తేజః " అని శ్లోకం. యజ్ఞోపవీతం పరమ పవిత్రం అయినది అని అర్థం. లఘు శంక సమయంలోనే కాదు దీర్ఘ శంక అప్పుడు కూడా యజ్ఞోపవీతాన్ని మెడలో హారం లాగా మార్చుకుని, కుడి చెవికి చుట్టుకోమని సంప్రదాయం ఆనతి. నమ్మకం ఉండి, ఆచరించ గలిగిన వారు అలానే చేస్తారు.

ఎందుకు అంటే, కుడి చెవిలో గంగ ఉంటుంది అని నమ్మిక. కొందరు అది అగ్ని స్థానం అనీ అనడం విన్నాను. మల మూత్ర విసర్జనా సమయంలో అపవిత్రం అవుతుందేమో అనే కారణంతో కుడి చెవుకి చుట్టుకోవాలని చెప్పి ఉండవచ్చు. కుడి చెవికే ఎందుకు అన్నదానికి కారణం పైన రాసాను.

ఇంకో విషయం : దైవ పూజలప్పుడు యజ్ఞోపవీతం ఉపవీతి గా.. అంటే ఎడమ భుజం పైన ఉంటుంది. ఈ స్థితి నే ' సవ్యం ' అనీ అంటారు. పితృ కార్యాలప్పుడు కుడి భుజం మీదికి మార్చుకోవాలి. దీన్ని ' ప్రాచీనావీతి ' అంటారు. ' అపసవ్యం ' అనీ అంటారు. మనుష్య కార్యాలప్పుడు ' నివీతి ' గా అంటే మెడలో హారం లాగా ధరిస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం

శ్రీరామునికి సోదరి ఉందా????

రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు?