వేదవ్యాసునికి శుక్ర మహర్షి పుత్రునిగా ఎలా జన్మించేను

వేదవ్యాసునకు శుక మహర్షి పుత్రునిగా ఎలా కలిగెను?

వేదవ్యాసులు ఓ రోజు గంగానదీతీరాన స్నానానికి వెడుతూ ఓ పక్షులజంటను చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పుడే గ్రుడ్డులోంచి బయటకు వచ్చిన పిల్లలనోటికి ఎక్కడనుంచో తీసుకువచ్చిన ఆహారాన్ని అందిస్తున్నాయి పక్షులు. పిల్లలు ఎర్రటినోళ్ళతో కిచకిచమని అరుస్తున్నాయి. " ఎంత అద్భుతంగా ఉంది, పక్షులే సంసారంలోని మధురానుభూతులను ఇలా ఆనందిస్తూంటే మనుషులగురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరమేముంది " అని అనుకున్న వ్యాసులవారికి కూడా ఓ కొడుకును పొందాలనే కోరిక కలిగింది. శుకజననం జరిగింది.

వ్యాసర్షి శుక్రుడిని కూడా పెళ్ళిచేసుకుని సంతానాన్ని పొందమంటారు. శుకుడు " ససేమిరా " అనడంతో జనకమహారాజు వద్దకు వెళ్ళి జీవిత సత్యం తెలుసుకోమంటారు. సరే అని శుకుడు వెళ్ళేసరికి జనకుడు సభా కార్యక్రమాలు చేస్తూంటారు. ఇంతగా మామూలు పనుల్లో మునిగిపోయిన ఈయనేం తత్త్వం చెబుతాడు అనుకుని శుకుడు వెళ్ళిపోతూంటాడు. అప్పుడు జనకుడు శుకుడిని పిలిచి కూర్చోబెట్టి విషయం తెలుసుకుని దూరంగా నృత్యప్రదర్శన జరుగుతూన్నచోట కాపలాగా ఉన్న భటుడిని పిలిపిస్తాడు. భటుడితో " అందరూ నృత్యాలు, కీర్తనలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు, నీకు ఎలా అనిపించింది " అని అడుగుతాడు. భటుడు " క్షమించండి రాజా, నన్ను నృత్యం చేస్తూన్న స్త్రీలకు హాని జరగకుండా కాపలా కాయమన్నారు. నాలుగువైపులా పరిశీలిస్తూ జాగ్రత్తగా కాపలాకాస్తున్నాను. నృత్యం గురించి కాని కీర్తనలగురించి కాని పరిశీలనగా చూసే అవకాశమేలేదు నాకు " అని చెప్పగానే భటుడిని పంపించేసి శుకుడితో " నీ విద్యుక్తకర్మలు నువ్వు శ్రద్ధగా చేస్తూన్నంతకాలం లౌకికవిషయాలు నీ మనస్సులోకి ప్రవేశించవు. అదే జీవిత సత్యం. నేనైనా నువ్వైనా శ్రద్ధగా విద్యుక్తకర్మలు చేస్తూనే ఉండాలి. సభలో నేను రాజుగానే ఉండాలి " అని చెబుతాడు. శుకుడు అబ్బురపడి ఎన్నో తత్త్వవిషయాలు తెలుసుకుంటారు జనకుడి దగ్గర.

సత్పురుషుల మనస్సు అలా ఉంటుంది. తప్పు జరగడానికి అవకాశమే ఇవ్వదు. కర్మలు చేస్తూనే ఉంటారు కాని ఆ కర్మల ఫలాలు వారికి అంటవు. నైష్కర్మ్యులు.

శుభమస్తు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం

శ్రీరామునికి సోదరి ఉందా????

రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు?