మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే క్షణాల్లో ఏం జరిగేది

మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే క్షణాల్లో యుద్ధం ముగిసిపోయేది కదా? ఎందుకు 18 రోజుల పాటు కోట్లాది మంది చనిపోయేదాకా యుద్ధం జరగనిచ్చాడు?"

" అపరాజితః " - విష్ణుసహస్రనామాలలో ఓ అద్భుత నామం. దీనికి " ఓటమిని ఎరుగని వారు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.

భీష్ముడు అంటారు " కృష్ణుడు పాండవుల పక్షాన లేకపోతే ఈ పాండవులను అందరినీ ఒక్క బాణంతో సంహరించేస్తాను " అని.

దుర్యోధనుడు కొంచెం నిష్టూరంగా మాట్లాడగానే భీష్ముడు అంటారు " ఈ రోజు అర్జునుడిని సంహరించడమో, కృష్ణుడి చేత ఆయుధం పట్టించడమో చేసి తీరుతాను " అని.

ఇద్దరినీ సంహరిస్తాను అనవచ్చుగా భీష్ముడు. కుదరదు. కృష్ణుడు అపరాజితుడు.

ఇక్కడో ధర్మసూక్ష్మం ఉంది. ఆయుధం పట్టనని కృష్ణుడు అలా ఎలా చేసారు అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. భీష్ముడు కృష్ణ భక్తుడు. అతను చెసిన ప్రతిజ్ఞలలో ఏదో ఒకటి నెరవేరేలా చూసే బాధ్యత కృష్ణుడిదే కదా. భక్తుల కోసం ఆయన ఓ మెట్టు దిగుతారు. విష్ణుసహస్రనామాలలో " అచలః, చలః " అని రెండు నామాలు. చలించరు, చలిస్తారు ( నియమాల నుంచి ) అని. భీష్ముడు విషయంలో చలించారు.

ఇంకో ముఖ్య విషయం. పాండవులు, వారి పక్షాన ఉన్న మిగతా వీరులు " అతన్ని నేను చంపుతాను, ఇతన్ని నేను చంపుతాను " అని ప్రతిజ్ఞలు చేసి ఉన్నప్పుడు కృష్ణుడు ఎవరిని చంపాలి, దేనికోసం ఆయుధం పట్టాలి.

శుభమస్తు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం

శ్రీరామునికి సోదరి ఉందా????

రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు?