రామాయణం రాయాలని రాజు రాయిపించుకుండా. అసలు కథ రామాయణం
రామాయణం అంటే ఎవరో రాజు డబ్బులిచ్చి రాయించుకున్న బయోగ్రఫీ / జీవిత చరిత్ర కాదు. ఓ రచయిత పనిగట్టుకు ఇంటర్వ్యూ చేసి రాయలేదు.
రామాయణం రాయటానికి కావలసిన తపస్సు వాల్మీకి మహర్షి చేసారు. కొన్ని వందలు కాకపోతే కొన్ని వేల యేళ్ళు. తపస్సు చేసి హృదయానికి తగిన పవిత్రత చేకూర్చుకున్నా కానీ రామాయణం గురించి రాసే అవకాశం వారికి కలుగలేదు.
ఒకనాడు శిష్యులతో కలిసి మధ్యాహ్న స్నానానికి వెళ్తే , ఒక బోయవాడు రెండు క్రౌంచపక్షులజంటలో ఒకదానిని పడగొడతాడు. అప్పుడు వాల్మీకి
- మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
- యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
అంటారు. దానర్థం లౌకికంగా చూస్తే
"వర్రె న్నీ బోయవాడా, కలిసి వున్న క్రౌంచపక్షులను కొట్టి చంపుతావురే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతికి వుండవు ఫో!" అని. యదార్థంగా ఇదే అంటారు. దీనిని మరోలా మరోలా వివరించగలను కానీ, అవన్నీ అర్థం చేసుకునే బుఱ్ఱ మీకు వుందని నేను అనుకోవట్లేదు (ఈ ప్రశ్నను బట్టి). ఈ ప్రశ్నకు ఇంత matter చాలు.
జరిగింది ఇంతే, But it meant something. ఒక జంటను విడదీస్తే వాల్మీకి మహర్షికి కోపం వచ్చింది. రామాయణం point అంతా అక్కడే వుంది. మిగిలిన ఘోరాలన్నీ ఈ point కు ప్రేరేపిస్తాయి, లేదా ఈ point వలన ప్రభావం చెందుతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అది అందుకునే హృదయ కోమలత్వం వాల్మీకి మహర్షికి కలిగాక గానీ వారు రామాయణం రాయలేకపోయారు. ఇంకెక్కడి బందిపోటు? He is a saint! మహర్షి! I say he is more than capable to write the epic!
తపస్సు చేయగా చేయగా వారి మనస్సుకు కలిగిన కోమలత్వానికి వారికి విధి/విధాత ఇచ్చిన అవకాశం అది. రామాయణం వేరొకరు కాదు కదా, తగిన అర్హత కలిగే వరకూ వాల్మీకి మహర్షికే రాయటం కుదరలేదు.
రాసిన వారిని point చేసే అధికారం మనకు లేదు. వాల్మీకి మహర్షికి ఏదో fluke లో తగిలిన luck కాదు అది. He earned it.
And Yes, అయోధ్యలో రాజ్యంలో కూర్చుని ఏం జరిగిందో డైరీ రాసినట్టు రామాయణం రాయలేదు. మీకలా అనిపిస్తే అది తప్పు. రామాయణం బ్రహ్మ గారి వరప్రభావంతో
వాల్మీకి మహర్షికి యదార్ధంగా రామాయణం లోని వారందరూ ఏం ఏం మాట్లాడారు, వారి మనసులలో ఏముందో కనబడగలదు. అది వరము. కాబట్టి వారి కంటికి అసత్యము కనబడే అవకాశం లేదు. వారు కల్పించి చదవవలసిన అవసరమూ లేదు. వారి కంటికి కనబడుతోంటే కల్పనలెందుకింకా, కాబట్టి మనకు వున్న అన్ని రామాయణాలకూ వాల్మీకి రామాయణమే శ్రేష్ఠమైనది, నిజమైనది. నాతో సహా ఇంకెవరు రామాయణం రాసినా మా కల్పనలు జోడించే అవకాశం వుంది, మొల్ల, తులసీదాస్ సహా అలా చాలా జోడించారు కూడా.అది తప్పనట్లేదు. చాలా బావుంటాయి, మనసుకు ఆహ్లాదంగా వుంటాయి. వాల్మీకి రామాయణమే అకాల్పనికము మాట్లాడుతుంది.
పూర్తి వివరాలకు రామాయణం కనీసం ఒక్కసారన్నా చదవమని మనవి. రామాయణం లో , రామాయణం గురించి, రామాయణం పై మనకు వున్న డౌట్లన్నీ రామాయణమే తీర్చ గలదు. మనకి కూడా అంత హృదయకోమలత్వం అలవడితే మొత్తం రామాయణంలో ఏదో ఒక చోట మనమూ బాధపడతాము. ఎక్కడో ఓ చోట మనకంట్లో నీరు వస్తుంది. ఓ సారి చదివితే కదా అసలు నా మొహమూ…
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి