నెలరోజులు చిలకడదుంపలు తింటున్నారా????
నెలరోజులు చిలగడదుంపలు తిని చూడండి.. ఏమవుతుందో మీరే చెప్పండి! భూమిలో పండే అనేక ఆహారాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అటువంటి ఆహారాలలో చిలకడదుంప ఒకటి. అయితే చిలకడదుంపలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు . నెలరోజులపాటు ప్రతిరోజు చిలకడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. చిలకడ దుంపలతో బరువుకు చెక్ చిలకడదుంపలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని ప్రతిరోజు చిలకడదపలను మితంగా తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. చిలకడదుంపలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి కడుపు నిండిన భావన కలిగిస్తుందని, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలని భావించే వారికి చిలగడ దుంప గొప్ప ఆహారం అని చెబుతున్నారు. షుగర్ నియంత్రణకు చిలకడ దుంపలు అంతేకాదు చిలకడదుంపలలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణకు చిలకడదుం...